రొట్టెల ఇల్లు | House of Bread | בית לחם Forum Index
రొట్టెల ఇల్లు | House of Bread | בית לחם
"He who eats this bread will live forever" (Jn6:58b;1:1,14)

Skyfeast eCommunion: A new liturgy on flextime basis
FAQ Search Memberlist Usergroups Register Log in
రొట్టెల ఇల్లు | House of Bread | בית לחם Forum Index
రొట్టెల ఇల్లు | House of Bread | בית לחם Forum Index New Beginnings Testimony of Ex-Member of Parliament, India (in Telugu)
View previous topic :: View next topic
Post new topic     Reply to topic
Fri Dec 18, 2009 4:43 pm
Author Message
Administrator
Site Admin

Joined: 02 Aug 2006
Posts: 35
Location: India
Reply with quote

Testimony of Ex-Member of Parliament, India (in Telugu)

మోక్షానికి మార్గం-దేవుని ప్రేమ స్వాతంత్ర సమర యోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులుపండిత ధర్మప్రకాశ్ శర్మ గారి సాక్ష్యం. సనాతన పరశర బ్రాహ్మణ,వేదవ్యాసవంశంలో1893లో జన్మించి రాజస్థాన్ లోని,హిందూ అతిపురాతన అతిపవిత్ర తీర్థస్థానమైన పుష్కర్ లో వున్న ఏకైక బ్రహ్మదేవాలయానికి ముఖ్య పుజారిగా(నలుగురు శంకరాచార్యులూ యీయన పాదములు కడిగి ఆనీటిని త్రాగుతారు, ప్రపంచంలో ఇంకెక్కడా బ్రహ్మ దేవాలయాలు లేవు)వున్న నా తండ్రి పండిత శోహన్ లాల్ శర్మ గారు 90% సమాజం వర్గ వర్ణకులమతఅంటరానితనంవల్ల కాపరిలేనిగొఱ్ఱెల్లా, 10% “ఆర్య పారశీక మొఘల్ పోర్చుగీసు ఆంగ్ల”విదేశీ,స్వదేశీ గొఱ్ఱె చర్మం కప్పుకున్నతోడేళ్ళకు బలై చీకటి,మరణఛాయల్లోవున్నదళితబలహీనవర్గాల దుస్థితి చూచి చలించి తనభోగవిలాస రాజ పురోహిత అధికార భవనాన్ని వదలి దేవునిప్రజలతో(హరిజనులతో)శ్రమ అనుభవించడం మేలనియోచించి వారి మధ్యే నివసిస్తూ సంస్కృతహిందీభాషల్లో తనభావాలను ప్రచురించినప్పుడు అనేకులు ఆయనశిష్యులుగా చేరి భారత భౌతిక అధ్యాత్మిక స్వతంత్రా నికై కంకణం కట్టుకున్నారు. ఎన్నో ఎక రాలను ఎంతో బంగారాన్ని పేదలకై తిరిగిచ్చిన నాతండ్రి భావాలను,బాలగంగాధర్ తిలక్ లాలా లాజ్ పాత్ రాయ్, వినోబాభావె వంటివారు ప్రశంశిస్తున్న రోజుల్లో మహాత్మాగాంధీ మానాన్నగారి ఆత్మీయ స్నేహితులయ్యారు.నా తల్లి కేవలం 16సం||ల వయస్సుకే మహాత్మాగాంధీ గారి ప్రేరణతో మాతృదేశస్వతంత్ర పోరాటానికై సీతాపూర్ ధనిక బ్రాహ్మణ ఇంటి సుఖాల వదలి సత్యాగ్రహంలో లాఠీలను సహించడంవల్ల యూ.పి మాహిళాకాంగ్రెస్ అద్యక్షురాలిగా ఎదిగారు.బ్రహ్మచారిగా వుంటానన్న నాన్నగార్ని గాంధీ గారు వారించి, 1932 అక్టోబరులో ఖద్దరు ధరించిన వీరిద్దరి వివాహం, శ్రీమతి స్వరూపరాణి మోతీలాల్ నెహ్రూ వంటి వారి పెద్దల సమక్షంలో లక్నోలో గాంధీ గారు దైవసాక్షిగా సర్వ మత ప్రార్ధనతొ గావించినారు.మొదటి బిడ్డ1935లో చని పోయినప్పుడు నాతల్లి పరమేశ్వరునితో “నీవొక కుమారుణ్ణిస్తే అతణ్ణి నీ (మానవ-మాధవ) సేవకు తిరిగిస్తా”అని మ్రొక్కుకొంది.నేను గర్భ్హంలోపడిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నా తండ్రికి 6 సం||ల కఠినకారాగార శిక్ష విధిం చింది.అయినా సత్యాగ్రహాలు మాననిమాఅమ్మను గర్భ్హవతి గానే ఫతేహ్ పూర్ జైల్లో నిర్భ్హందించినపుడు 1937డిసెంబర్23న నేను జైల్లో జన్మిం చాను.కొన్ని నెల్లకు విడుదలై వెళ్తూవస్తూ నన్నువడిలో పెట్టుకొని దైవప్రేమ దేశప్రేమ గీతాలను ఆలించినప్పుడు ఆమె కన్నీరు నామీద పడి“అమ్మా,నాన్నకోసం ఏడుస్తున్నావా?”అంటే “లేదురా దైవప్రేమ-దేశప్రేమతో ఏడుస్తున్నానురా” అంది.“ఆ దైవంనీ తండ్రి కూడా అంది.“అమ్మా తండ్రి దేవుణ్ణి ఇపుడే చూపించు”అన్నాను.“దైవప్రేమను రుచించినపుడు నీలోనే ఆదైవాన్ని అనుభవిస్తావు ఆయన్నే సేవి స్తావ్”అంది.నా తల్లి తిరిగి జైల్లో వేయబడి నప్పుడు నన్ను గాంధీగారు తనవద్దే అశ్రమంలో వుంచుకొన్నారు. గాంధీ గారు భుజాలపై నన్నాడించిన రోజులు నాకింకా గుర్తున్నాయి.1945లో జైల్లోనుండి విడుదలైన తల్లి దగ్గరకు తిరిగి వచ్చాను. పుష్కర్ తీర్థంలో తన రంగ స్థల పురాణ నాటకాలతో భక్తులనలరించే ఎత్తైన బలమైన గోపినాధ్ అనే ఒక బ్రాహ్మణ పూజారి నా బాల్య హీరో(పెద్దయినప్పుడు ఇలా ఉండాలి అనుకునేవాణ్ణి) అయితే ఓ రోజు మాఅందరి కళ్ళముందే రక్తం కక్కుతూ విలవిలలాడి చనిపోయాడు.నా హృదయం తల్లడిల్లింది.ఓ రోజు నేను కూడా చని పోతానా?పుట్టుక మరణం సృష్టి ఉద్దేశ్యం తెలిసికోడానికి7సం||లు వేదాంతం ధ్యానించాను. ఖురాన్,బౌద్ధ,పార్శీగ్రంధాలను ఆశతో చదివాను. కాని నా ప్రశ్నలకు సమాధానం దొరక లేదు. తల్లితో కలసి సత్యాగ్రహాలు చేస్తున్న నన్ను బ్రిటిష్ పోలీసులు చితుకబాది ఓ రోజంతా జైల్లోవుంచి మరునాడు దూరఅరణ్యంలో విడిచి పెట్టారు.తెల్లవాడంటే పగద్వేషంవల్ల బైబిల్ నా దృష్టికి రాలేదు. సుభాశ్ చంద్ర బోస్ పిలుపు“నాకు రక్తాన్నివ్వు నీకుస్వతంత్ర మిప్పిస్తా”భావోద్రేకాలకు గురిచేయగా ముంజేతిని కోసి రక్తంతో సంతకం చేసాను.కార్ల్ మార్క్స్ డస్ కాపిటల్ ఆలోచింప జేసింది. ఓ రోజు ఉత్తరాలు చదువు తున్న గాంధీ గారు,ఓ హిందూ ఉగ్ర వాది వ్రాసిన “నీవు కుక్కవు,త్వరలో నిన్ను చంపుతాం” అంటూ ఎన్నో బూతులు ఉన్నాఉత్తరాన్ని బిగ్గరగా చదివారు.ఇదొక బహుమతి అన్నారాయన. జవాబులో “ప్రియ సోదరా ఉత్తరానికై ధన్యవాదములు నీ భావాల ను నేను గౌరవిస్తాను కాని నేను దైవ చిత్తాన్ని,దేశ క్షేమాన్నికోరి మాత్రమే ఈ అహింసా మార్గాన్ని ఎన్ను కొన్నాను.అయితే దేవుడు నిన్ను తనశాంతితో దీవించు గాక. మా ఆశ్రమానికి స్వాగతం”అంటూ వ్రాసినఉత్తరం నాపై గాంధేయ వాదిగా చెరగనిముద్ర వేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత సాయంకాలపు ప్రార్దనలో వినోబాభావె గారు,గాంధీ గారితో “దైవం తోడు గనుక కోమటి ఐనా మీరు భౌతిక స్వతంత్రం సంపాదించ గలిగారు,మరి అధ్యాత్మిక స్వతంత్రం (దేవుని రాజ్యం) మాటేమిటి” అనడిగినప్పుడు, “భౌతిక స్వతంత్రం నాకు (సంతృప్తి నివ్వలేదు)నిరాశే మిగిల్చింది,ప్రస్తుత రాజకీయ పరిస్థితులు (స్వాతంత్ర సమర సమయంలొ విదేశీ తొత్తులు గా వుండి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెరువు లోనికి దాటిన కప్పదాటు బూర్జువా వర్గం గలతీ2:4 సంఘాల్లో ఇదేస్థితి) వృధ్ధాప్యంలో దేవునిరాజ్యం గురించి ప్రార్దించడం కంటే ఎక్కువ నేనేమీచేయలేను అన్నారాయన. భౌతికులు తమ భౌతికులను పరిపాలించుకోనియ్యండి, ఆధ్యాత్మికులు దేవుని రాజ్యం కోసం పనిచేయాలని గాంధీ గారు,నా తండ్రితో సహా అనేక మంది 1947 లోనే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు.దేవునిరాజ్యవిరోధి లూసీఫర్, హిందూ ఉగ్రవాదైన మరాఠీ ఘాడ్సేను ప్రేరేపించి, మహాత్ముణ్ణి మట్టు బెట్టి నప్పుడు, శోకించిన హృదయపు లోతుల్లో నుండి 1949 లో వచ్చిన, నా మొదటి కవితా సంపుటి “ఉదయకిరణం” అచ్చయింది.అనేక గాంధీలు భారత గ్రామాల్లో ఉదయించాలన్న అశావాదమే దాని సారాంశం. 1952లో స్వచ్చంద పత్రకారునిగా వుంటూ అజ్మేర్ ప్రభుత్వకళాశాలలో చేరాను.1954లో ఆంగ్లపాఠ్యాంశమైన “కొండమీద ప్రసంగం Sermon on the Mount”.చదువు తున్నపుడు నిర్ఘాంతపోయాను ఎవరీ ప్రసంగకర్త?అనేక మహాత్ముల/ప్రవక్తల ప్రసంగాలు విన్నాను చదివాను కాని, ఈయన మాట లాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడ లేదే? అనుకుంటూ,అధ్యాయపరిచయాన్ని చూసాను. ప్రసంగకర్త యూదుడైన యేసుక్రీస్తు అని,అతని స్వంత ఇశ్రయేలు ప్రజలే రోమన్ విదేశీ పాలకులచేతికతనప్పగించినప్పుడు ఈ ప్రసంగచక్రవర్తి వధకు అప్పగింపబడిన గొఱ్ఱెవలె మౌనం వహించి సిలువలో వ్రేలాడి మరణించి,తాను ముందునుండే చెబుతున్నవిధంగా,లోకపాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి“గొఱ్ఱెచర్మం-కప్పుకున్న-తోడేళ్ళ”చేఅనేకహింసలు పొంది మూడవ దినాన్న మరణాన్నిజయించి తిరిగి లేస్తానన్నపుడు తనస్వంతఇంటివారి చేతే పిచ్చోడని/దెయ్యంపట్టిన వాడని గధ్ధింపబడిన ఈయేసే నిజంగానే మరణాన్ని జయించడం చూసిన పామర శిష్యులు ముందు నమ్మనప్పటికీ ఆయేసు పునరుత్థా నాత్మ వాక్య శక్తితో ప్రపంచంలోని అన్ని భాషల్లో, సిలువవేయబడిన వానిగా ప్రకటించారు, అన్ని రకాల ప్రజల్లో నమ్మబడెను.చదువు తున్న నాకు ముచ్చెమటలు పోసాయి.ఇంతకాలం బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకుంటున్న ఈ యేసు తెల్ల ఐరోప వ్యక్తి కాదు మన ఆసియ వాసే, ఆశ్రమంలో ఉదయాన్నేగాంధీగారు బైబిల్ ఎందుకుచదివేవారో ఇప్పుడర్ధ మయ్యింది.(నిజానికి దక్షిణాఫ్రికా లోనే గాంధీ గారికి కొండమీద ప్రసంగం కంఠోపాఠం)అప్పుడే ఓవెలుగు స్వరం “ఆ యేసును నేనే నీ ప్రశ్నలకు సమాధానం నేనే” అనడం విని చుట్టూ చూసాను ఎవ్వరూ కనబడలేదు.తబ్బిబ్బై ఆంగ్లభాశాధ్యాపకుని వద్దకు పరుగెత్తాను. “యేసుక్రీస్తు దైవమా?”అన్నప్రశ్నకు ఆ నామకార్ధపు కేథలిక్ క్రైస్తవుడు ఉలిక్కిపడి (బహుశా, విధ్యార్ధులకు మతబోధ చేస్తున్నాననే ఆరోపణను తప్పించుకోడానికో లేక తానే రక్షణ లేని మత క్రైస్తవుడవ్వడం వల్లో) తన బిషప్ వద్దకు పంపించాడు.రాజపురోహిత కుమారుణ్ణని ఎరిగి,నీవు బాప్తీస్మ మాస్ లో పాల్గొనే క్రైస్తవునిగా అయితే గాని క్రీస్తు దైవత్వాన్ని అర్ధం చేసుకోలేవన్నడా మహానుభావుడు. సంవత్సరాలుగా బాప్తీస్మ మాస్ లో పాల్గొనే ఆంగ్లభాశా అధ్యాపకునికి అర్ధం కానిది నాకేలా అర్ధం అవు తుంది? ఆయన మాటల్లో తిరకాసు చూసి వెనుతిరిగాను. బహుశా ప్రొటెస్టెంట్ వారికి క్రీస్తు దైవత్వం బాగా తెలిసివుండ వచ్చని దగ్గర్లో వున్న CSI(CNI) చర్చికి వెళ్ళి వెనుక కూర్చోని చూస్త్తే ఏదో చందాలు సన్మానాలు పదవులు కమిటీలు ధానధర్మాలు క్రిస్మస్ లోతాగి కేరల్స్ పాడే వారు, చివర్లో మొక్కుబడిగా బైబిల్ చదివి ఏదో చెప్పాలనుకొ న్న ముసలి పాదిరీ గారికి నా పక్కనే వున్న ఓవ్యక్తి చేయెత్తి గడియారం చూపించే సరికి సభను ముగించడం,బయటకు వచ్చిన వారు పిచ్చాపాటి మాటలాడుకోడం నన్నంతో హతాశుణ్ణి చేసాయి. నేనెవర్నొ చెప్పుకోకుండా ఆ ముసలి పాదిరిని ఏకాంతంగా చాలా సార్లు కల సినపుడు పాడిందే పాడరా పాచిపళ్ళ పాష్టరూ అన్న చందాన విగ్రహారాధికులు నరకం పోతారు నువ్వు బాప్తీస్మం ఎపుడు తీసుకొని సంఘ సభ్యునివౌతావు అన్నాడు.నన్ను నరకంనుండి తప్పించ డంకంటే, నన్ను మతంలో చేర్చి విదేశీ డబ్బు సంపాదించడం ఆయన ప్రాధమికతగా కన్పించింది. పైపెచ్చు అక్కడ కనిపించే క్రైస్తవు లంతా ఆయా,ప్యూన్,మాలి వంటి ఉద్యోగాల కోసం తెల్ల దొరలమిషన్ కాంపౌండ్లో ఇళ్ళకోసం చేరినభోజనక్రైస్తవులులేకఈమధ్యనే చదువుకొని పైకొచ్చిన వారిపిల్లలతాలూకు నర్సులుప్రైమరీటీచర్లు క్లర్కులు సైనికు లు.వారి పిల్లలు చాలా మంది నాసహవిద్యార్ధులు. అంతకు ముందు వారితోకలవని నన్నీవిధంగా తమ చర్చీలో చూసి కొని మురిసి పోయారు.కాని నాప్రశ్నలకు ముఖం తెళ్ళబెట్టారు. చార్లేస్ అనే నా సహ విద్యార్ధి ఓ రోజు బండ బూతులు తిడుతూ ఇంకో విద్యార్ధిని కొడుతూ వుంటే,నేనడ్డు పడి “ఓ చెంప మీద కొట్టేవానికి నీరెండో చెంపకూడా చూప మన్నాడుగా మన యేసుక్రీస్తు” అన్నాను. మామీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? అని చార్లేస్ నా రెండు చెంపలు పగులగొట్టాడు.ఓరోజు ఎవరు నాతో సెకెండ్ షో సినిమాకి వస్తారని అడిగాను. హిందూముస్లిం అమ్మాయిలు క్షమించండి మా తలిదండ్రులు ఒప్పుకోరు అన్నారు. క్రైస్తవ అమ్మాయిలు మాత్రం మేం రడీ అన్నారు. తలిదండ్రులను మేంలెక్క చేయం అన్నారు.మేంఅగ్రకులాల నుండి వచ్చిన క్రైస్తవులం అంటూ అబద్దాలు చెబుతూ తోటి పేదదళిత రక్తసంభందికి ముఖము తప్పించి తమ ఇంటిలోనికి రానీయని వారిని,నాకు పరిశుధ్ధాత్మ వచ్చేసింది అంటూ కిచకిచలాడి గొణుగు కుంభనాడ్ మంత్రజ్ఞులు అమాయకులకు ప్రార్ధించి డబ్బు దండడం చూసి, ఓహ్ ఇదా క్రైస్తవ్యం అని జుగుప్సతో దూరంగా పారిపోయా.ఈ కొండమీద ప్రసంగం కేవలం మాటలగారడి, క్రీస్తొక ఓడిపోయిన వేషధారి, దైవ రాజ్యాన్ని స్థాపించలేకపోయిన మానాన్న,గాంధీ వంటి సామాన్య మానవుడే అని చెప్పి,అప్పటికే స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఉన్న నేను నాపరపతి పెంచుకోడానికి(రాజకీయ నాయకుల స్వార్దం ఆదాము స్వభావం గమనించండి) లైబ్రరీలోని బైబిళ్ళన్నీ తెప్పించి బహిరంగ సభలో “భారత దేశాన్ని పోర్చుగీసు,ఇంగ్లీషు వారికి 350 సం||లు మనల్ని బానిసలుగా చేయించిన ఈపుస్తకాన్ని ఏంచెయ్యాలని ప్రశ్నించిన నాకు “నాశనంచేయి నాశనంచేయి” అన్నకేకలకు బైబిళ్ళన్నీ చింపి కాళ్ళ్తతో తొక్కి కిరోసిన్ పోసి సిగరెట్ తో నిప్పంటించాను.ఎగసిన మంటలు నాలోని కర్కశత్వానికి నాకే అద్దంపట్టాయి. తిను,తాగు రేపేమవుతుందో ఎవడిక్కావాలన్న పంధాలోనికి వచ్చేసాను.1957లో రాజస్థాన్ సాహిత్య అకాడమి వారు నన్ను రాజ్యకవి గా సన్మానించినపుడు ముఖ్య అతిధిగా విచ్చేసిన అప్పటి హిందీ దర్శకుడు నటుడు భరత్ భూషణ్ నన్నుతనసినీమాలకు పాటలు వ్రాయించాడు.తరువాత సౌతేలా భాయ్, పాకీజా వంటి చిత్రాల్లోనటించాను. అవిరాష్ట్రపతి అవార్డు లందుకొన్నాయి. మీడియా “ఎడారి గులాబి” అని ఉప్పొంగిచింది.ఓ పెళ్ళైన హీరొయిన్ నావెనుక బడి పెళ్ళిచేసుకోకపోతే అత్మహత్యచేసు కొంటానంది. వదిలించి కోవడం కష్టమైంది.చాలా సినిమాల్లో సంపాదించిన డబ్బుతో మెరైన్ డ్రైవ్ లో ఇళ్ళు కొన్నాను.నాతల్లి పెంపకం వల్ల నైతికమానాన్ని కాపాడుకొన్నా సిగరెట్లుస్కాచ్ కు అలవాటు పడ్డాను. మత్తులో సమ సమాజ స్థాపన తుపాకి గొట్టం ద్వారా సాధ్య మని తలంచాను. వృద్ద మిత్రుడైన EMS నంబూ ద్రిపాడ్(మొట్టమొదటి కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి)నేనురష్యాలో దర్శకకోర్స్ చెయ్యాలని సిఫారసు చేసాడు. కమ్యూనిజం నాన్నిష్ట పడడని నాన్నకి తెలియకుండా పాస్ పోర్ట్ కి అప్లై చేసాను. ఇంటిల్జెన్స్ ఫైల్లో కమ్యూనిస్టుగా ముద్ర పడి పాస్ పోర్ట్ రావడంలేదని తెలిసి, ఢీల్లీలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కలుసుకుని అదే రోజు పాస్ పోర్ట్ సంపాదించాను.నన్ను కౌగలించు కొని మిత్రుడైన నాన్న యోగక్షేమాన్ని అడిగిన నెహ్రూగారు ఎక్కడ ఈ విషయాన్ని నాన్నగారితో ప్రస్తా విస్తారో అని భయపడ్డా ను.1961 రష్యా లో ఉన్న మూడో నెలలో నాతల్లి కిడ్నీ సమస్యతో కోమాలో వున్నారని స్వదేశానికి తిరిగి వచ్చాను.నాలుగు రోజుల తర్వాత కళ్ళు తెరచి “దేశ స్వతంత్రం కోసం పోరాడిన మేము నిన్ను సినిమాల్లో గంతులు వేసేవానిగా చూడలేము,నిన్ను గర్భంలో పడక మునుపే(మానవ-మాధవ) సేవకు అర్పించాను,ఇకపై సినిమాలు చేయ రాదు” అంది.అయిష్టంగానే సరే నన్నాను.ఓరోజు తల్లిని చూట్టానికి వచ్చిన కలెక్టర్ మిత్రునితో మాట్లాడు తుండగా చిన్నతనం నుండీ తెల్లచీరతో నాకలలో వచ్చేఅమ్మాయే కనిపించింది.ఆమెఇంటికి వెళ్ళాను.ఆమెతండ్రి“నేను యేసుక్రీస్తు సువార్తికుణ్ణి భక్త్ సింగ్ జతపనివాణ్ణి,నాకుమార్తెను ఓఅవిశ్వాసికి ఇవ్వను” అ
View user's profile Send private message [ Hidden ]
Back to top
Page 1 of 1
Jump to:  
Display posts from previous:
Back to top
Post new topic     Reply to topic
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum
All times are GMT + 5.5 Hours